ETV Bharat / state

రంపచోడవరంలో జాతీయ లోక్​ అదాలత్​ దినోత్సవం

author img

By

Published : Dec 12, 2020, 4:44 PM IST

జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీకి అనుకూలమైన కేసులకు పరిష్కారం చూపిస్తున్నామని జ్యుడీషియల్​ కోర్టు మెజిస్ట్రేట్ పి. రాజశేఖర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవాన్ని నిర్వహించారు.

national lok adalat
జాతీయ లోక్​ అదాలత్​

వర్చువల్​ పద్ధతిలో లోక్​ అదాలత్​ ద్వారా కేసులను పరిష్కరిస్తున్నామని జ్యుడీషియల్​ కోర్టు మెజిస్ట్రేట్ పి. రాజశేఖర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 కేసులు రాజీ చేసినట్టు మెజిస్ట్రేట్ తెలిపారు. ముద్దాయిలు, కక్షిదారులు సంబంధిత పోలీస్​స్టేషన్​లకు వెళ్లి దూరదృశ్య సమావేశం ద్వారా హాజరవుతున్నట్లు చెప్పారు.

రంపచోడవరం, అడ్డతీగల కోర్టుల పరిధిలోని పదకొండు మండలాల్లో పెండింగ్​లో ఉన్న కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో లోక్ అదాలత్​లను నేరుగా కోర్టులో నిర్వహించేవారు. కొవిడ్​ కారణంగా ఆన్​లైన్​ ద్వారా సమావేశమవుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రకాశ్​, శ్రీనివాస్, భగవాన్, సంతోషకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొత్తపేట కెనరా బ్యాంకులో.. మరో 20 కాసుల బంగారం మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.