Michaung Cyclone in East Godavari District : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతి పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసి పడుతున్నాయి. ఓడలరేవు, ఎస్. యానాం, కాట్రేనికోన, అంతర్వేది తదితర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. అలల తీవ్రతకు ఈ ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతోంది. కార్తిక మాసం కావడంతో సందర్శుకులెవరూ సముద్ర స్నానాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
బాధితుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలి - అధికారులతో సీఎం జగన్
Farmers Suffer Due to Cyclone : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడనున్న తరుణంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అన్నదాతలు హైరానా పడుతున్నారు. కోతలు పూర్తయిన పొలాల నుంచి వరి పంటను ఒడ్డుకు చేర్చి కల్లాల్లో వేశారు. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటలు నేల వాలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్ష 52వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. దీంట్లో లక్ష ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశుల రూపంలో కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు మదన పడుతున్నారు. కాకినాడ జిల్లాలో కల్లాల్లో ఉన్న 16 వేల టన్నుల ధ్యానాన్ని ఆదివారం యుద్ధప్రాతిపదికన కొనుగొలు కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లో సేకరించినట్లు అధికారులు తెలిపారు.
దూసుకొస్తున్న మిగ్జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
Responsibility of the Authorities : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 8977935609, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయం 0883-2442344, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం 0881-3231488 సమాచారం, సహాయం కోసం సంప్రదించవలిసిందిగా తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికల మేరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట కోతలు నిలిపివేయాలన్నారు. ఇప్పటికే కోతలు జరిగి పూర్తిగా ఆరని వరి పనులను కుప్పలుగా వేసేటప్పుడు ఎకరానికి 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించవచ్చన్నారు.
మిగ్ జాం తుపాను ప్రభావం - గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు
Rehabilitation Centers : తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. కోనసీమకు జయలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లాకు వివేక్ యాదవ్, కాకినాడకు యువరాజ్‌ను నియమించారు. కాకినాడలోని హోప్ఐలాండ్ చేపల వేటకు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న 214 కుటుంబాలను తరలించారు. వీరిని కాకినాడలోని డ్రైవర్స్ కాలనీకి తీసుకువచ్చి, వారి ఇళ్లకు చేర్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడుటంతో తీర ప్రాంతాలోని ప్రజలు ఆందోళన నెలకొంది.
తుపాను వస్తే తీరంలోని కరవాక, ముత్యాలపాలెం గ్రామాల్లో ప్రజలు తల దాచుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న కరవాకలో 2620 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మూడు తుపాను షెల్టర్లకుగాను ఒక్కటే ఉపయోగకరంగా ఉంది. మిగతా రెండు భవనాలు పెచ్చులు ఊడి, రెయిలింగ్‌లు దెబ్బతిని దుర్భరంగా మారాయి.