తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయకపోతే... ఇంకెప్పటికీ మార్పు జరగదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలంలో ఏర్పడిన జిల్లాల్లో... ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండపేట నియోజకవర్గ ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండే రాజమహేంద్రవరం జిల్లాలో.. నియోజకవర్గాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
మండపేటను అమలాపురం జిల్లాలో భాగమైతే 30 వేల జనాభా ఉన్న ద్వారపూడి, కేశవరం తదితర గ్రామాల ప్రజలు దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. అదే రాజమహేంద్రవరం అయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ మండపేట నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: శేష వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి...