ETV Bharat / state

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కోనసీమ వాసులు

author img

By

Published : Jun 16, 2020, 6:09 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కానీ వీటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు కోనసీమ ప్రాంత వాసులు. వారపు సంతల్లో గుంపులు గుంపులుగా ఉండి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. లాక్​డౌన్ నిబంధనలు కనీసం పాటించటం లేదు. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై అధికారులు మరింత అవగాహన పెంచాలని పలువురు కోరుతున్నారు.

violation of lockdown rules
లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తోన్న వినియోగదారులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా... తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంత వాసులు మాత్రం వారపు సంతల్లో గుంపులు, గుంపులుగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని పి. గన్నవరంలో మంగళవారం వారపు సంత జరుగుతుంది. సమీప గ్రామాల్లో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైనా... ప్రజలు ఏమాత్రం భయపడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంత జరుగుతున్న ప్రదేశానికి 4 కిలోమీటర్ల దూరంలో ఆర్. ఏనుగుపల్లిలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. ఇంత ప్రమాదకరంగా కరోనా వ్యాపిస్తున్నా... అక్కడి ప్రజలు మాత్రం భయపడడం లేదు. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:ప్రకృతి ఒడిలో... నీలి మబ్బులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.