ETV Bharat / state

మింగ మెతుకు లేదు... 54 ఎకరాలకు యజమాని అంటా! - కొత్తపాలెం గ్రామం

వాళ్లు ఉంటున్నది తాటాకు ఇంట్లో .. పెన్షన్​కోసం ధరఖాస్తు చేసుకుంటే భార్యభర్తలు ఇద్దరికి కలిపి 54 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ విషయం తెలుసుకుని వారు ఆ భూమికి పట్టాపుస్తకాలు అయినా ఇవ్వండి లేదా పింఛను అయినా ఇవ్వండి అంటున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరిజిల్లా కొత్తపాలెం గ్రామంలో జరిగింది.

ఉండేది తాటాకు ఇంట్లో... అధికారుల లెక్కలో 54 ఎకరాలంట!
author img

By

Published : Aug 1, 2019, 1:09 PM IST

Updated : Aug 1, 2019, 1:53 PM IST

తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికిచెందిన పెమ్మాడి శ్రీనివాస్ అతని భార్య వెంకటరమణ మత్స్యకారులు కుటుంబానికి చెందినవారు. తాటాకు ఇంట్లో సోడాబడ్డీ, మిషను కొట్టు పెట్టుకుని జీవనంసాగిస్తున్నారు. శ్రీనివాస్​కు 50ఏళ్లు నిండటంతో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను కొరకు ఆగస్టు 2018 దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు తిరస్కరించారు. తిరిగి ఈ ఏడాది జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అయినా మంజూరుకాలేదు. రెండు రోజుల క్రితం మండల రెవెన్యూ అధికారులను కలిసి తన సమస్య వివరించారు. అతని పేరుతో ఉన్న ఆధార్ నెంబరుకు 10 ఎకరాలు ఉన్నట్లు చూపడంతో పింఛను మంజూరు కావటంలేదని తేలింది. తన భార్య ఆధార్ నెంబరు పరిశీలించగా మండలంలోని వివిధ పంచాయతీల్లో 44 ఎకరాలు ఉన్నట్లు చూపుతోంది. దీంతో కంగుతిన్న దంపతులు ఆ 54 ఎకరాలభూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు ఇప్పించాలని లేదంటే గడచిన ఏడాదికి గాను పింఛను ఇవ్వాలని కోరుతూ జిల్లాకలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తమ సమస్యను చెపుతున్న శ్రీనివాస్

ఇదీ చూడండి వైద్యులు కాలు పోగొట్టారు... కనికరించండి

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి,
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు,
ఫోన్ 93944 50286

AP_TPG_11_01_GODAVARI_FLOOD_ABB_AP10092
( ) గోదావరి నదికి ఎగువన కురిసిన భారీ వర్షాలతో భయ్యా గోదావరి జిల్లాలలోని గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం గోదావరి తీర గ్రామాల పరిధిలో లంక పంటలు నీటమునిగాయి.

Body:లంక భూముల్లో అరటి కంద బెండ పచ్చిమిర్చి తోటలతో పాటు కూరగాయల పాదులు పశుగ్రాసాలు విరివిగా పండిస్తారు. వర్షాకాలం గోదావరి ఉదృతి ఎక్కువగా ఉంటే పంటలు నష్టపోవడం ఆనవాయితీగా మారింది. పంటలను రక్షించుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు పశుగ్రాసం దొరకడం గగనంగా మారింది.

Conclusion:శ్రావణమాసం ప్రారంభపు రోజులు కావడంతో అరటి జలాలకు గిరాకీ ఏర్పడడంతో నాలుగు రూపాయల రూపాయలు కళ్ల చూడవచ్చని రైతులు ఆశించారు గోదావరి వరదలు వారి ఆశల్ని అడియాశలు చేశాయి ఫలితంగా అరటి గెలలను వరద నీటిలో పడవలో ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. గోదావరి తమ కష్టాలను నీటిపాలు చేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు వరద నీటిలో పడవల మీద గెలవాలంటే ఒక్కొక్క గెలకు 25 నుంచి 30 రూపాయలు అదనపు ఖర్చు అవుతుందని వాపోతున్నారు.
బైట్స్: లంక భూముల రైతులు
Last Updated : Aug 1, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.