ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన వైకాపా నేతలు - వైకాపా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సరుకులు పంపిణీ

లాక్ డౌన్ కారణంగా పనుల్లేక ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, చేతివృత్తుల వారికి వైకాపా నేతలు అండగా నిలిచారు. వారికి సరకులు పంపిణీ చేశారు.

grocesaries distributed by ycp leaders in rajamahendravaram
వైకాపా ఆధ్వర్యంలో నిత్యావసర కిట్లు పంపిణీ
author img

By

Published : May 13, 2020, 5:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తుల వారికి వైకాపా నేతల ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వనిత.. పేదలకు వాటిని అందజేశారు. 5 రోజుల పాటు సుమారు 10 వేల మందికి పంచుతామని మంత్రులు తెలిపారు.

రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల్లో సరకులు పంపిణీ చేయనున్నారని తెలిపారు. వైకాపా సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

అనపర్తిలో పేదలకు కూరగాయల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.