తూర్పు గోదావరి జిల్లా.. పి గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి, పల్లెపాలెం దగ్గర గోదావరి నది పాయకు అడ్డుగా గట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పని దాదాపుగా పూర్తి కావచ్చింది. అవతల లంక భూముల నుంచి మట్టిని లారీలలో ఇవతలకు తరలించేందుకు .. నది పాయకు అడ్డుగా గట్టు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విషయంపై పి గన్నవరం ఎమ్మార్వో మృత్యుంజయరావు , హెడ్ వర్క్స్ అధికారులను వివరణ కోరగా.. అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదికి ఇలా అడ్డుకట్ట వేయడంపై.. ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: