డిసెంబరు 25 నాటికి ఇళ్ల స్థలాలను పంపిణీకి సిద్ధం చేయాలని.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్డీవో పనబాక రచన అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల స్థలాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో 26.73 ఎకరాల్లో 16 లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ జాన్ రాజు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. 1,033 ఫ్లాట్స్ విషయంలో పలువురు కోర్టును ఆశ్రయించారని.. వాటిపై కౌంటర్లు దాఖలు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: