గోదావరికి వరద రావటంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో లంక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. నాడు పచ్చగా ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరితే వరద రెండోసారి ముచ్చెత్తటంతో నేడు ఎండిపోయిన పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని గౌతమీ వంతెన సమీపంలో ఉన్న దొండపాదులోకి గతంలో గోదావరి వరద నీరు చేరి పంట పాడైపోయి పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోయిన పంటలను రైతులు బాగు చేసుకునే సమయంలో మళ్లీ గోదావరి నీరు చేరటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి