తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం, మురమళ్ళ వీరేశ్వరస్వామి ఆలయం, అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామాకానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయాల ధర్మకర్తల మండలి సభ్యుల్లో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించటంతో పాటు మొత్తం సభ్యుల్లో సగం మంది మహిళలు ఉండేలా సర్కారు ఇటీవల చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా నూతన సభ్యుల్లో రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఈ ఉత్తర్వులతో ఆయా ఆలయాల ప్రస్తుత ధర్మకర్తల మండలి రద్దు కానుంది.
ఇదీ చూడండి: