ఆశా వర్కర్లకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... కాకినాడలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రూ.10 వేల ప్రత్యేక అలవెన్స్ కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తల డిమాండ్స్ డే