ETV Bharat / state

అంతర్వేది చక్రస్నానంలో ఆ ఊరి వారికి ప్రత్యేకత... ఎందుకంటే.. - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చక్రస్నానంలో పేరూర్ గ్రామం వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. శతాబ్దాల కిందట జరిగిన ఆ సంఘటన ద్వారా నేటికీ ఆ ఊరి వారికి పత్యేక స్థానం కల్పించటం ఆనవాయితీగా వస్తోంది. అసలు అప్పుడు ఏం జరిగింది?

antarvedi-sri-lakshmi-narasimhaswamy-chakrasnanam-perur-village-has-a-special-place-for-them-in-east-godavari-district
అంతర్వేది చక్రస్నానంలో ఆ ఊరి వారికి ప్రత్యేకత ఎందుకంటే...
author img

By

Published : Feb 26, 2021, 9:06 PM IST

తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా నేడు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. అయితే ఈ ఘట్టంలో పేరూరు వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఎందుకంటే...

14వ శతాబ్దంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ చక్రస్నాన ఉత్సవంలో శ్రీవారి చక్ర పెరుమాళ్లు సముద్ర గామి అయినది(సముద్రంలో కొట్టుకుపోయింది). అప్పటి మొగల్తూరు మహారాజా వారు ఊరూరా చాటింపు వేయించి తపశ్శక్తితో ఎవరైతే శ్రీ చక్ర పెరుమాళ్లును సముద్రం నుంచి తీసుకు వచ్చి శ్రీవారికి సమర్పిస్తారో వారు కోరింది ఇస్తామని ప్రకటించారు. అప్పటికే స్వామివారి చక్రం విషయం పేరూరు గ్రామంలోని నరసింహ ఉపాసకులు అయిన బ్రహ్మశ్రీ నేమాని సోమనాథ నరసింహ చైనూలు గారికి.. స్వామి వారు స్వప్నంలో కనబడి ఈ కార్యక్రమానికి నువ్వే సమర్థుడవని అన్నారట.

ఆయన మాఘ బహుళ విదియ నాడు మొదలు పెట్టిన తపస్సు... వైశాఖ శుద్ధ ఏకాదశి నాటి వరకు కొనసాగింది. ఓ కెరటం ద్వారా స్వామివారి చక్ర పెరుమాళ్లు ఆయన చెంతకు చేరిందట. అనంతరం చక్ర పెరుమాళ్లుని ఆయన స్వామివారికి సమర్పించారు. అప్పుడు రాజావారు చైనూలుని.. ఆస్తులు, అంతస్తులు, మణి మాణిక్యాలు ఏమి కావాలో కోరుకోమనగా.... అవి ఏమీ వద్దు రాజా.. అంతర్వేది కళ్యాణోత్సవాల్లో పేరూరు వారికి ప్రత్యేక స్థానం కల్పించమని కోరారట. అప్పటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవంలో పేరూరు వారికి ప్రత్యేకత ఏర్పడింది. శ్రీవారి పెరుమాళ్లును పేరూరు వారే నెత్తిమీద పెట్టుకొని చక్రస్నానం చేయిస్తున్నారు.

ఇదీ చదవండి

స‌నాత‌న ధ‌ర్మానికి వేదం ప్ర‌మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.