తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని అన్నంపల్లి హై పోలవరం మండలం కొమరగిరిలో.. దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను అవమానించేలా ప్రవర్తించారు. జాతీయ రహదారి ప్రక్కనున్న ఆయన విగ్రహానికి... చూపుడు వేలును తొలగించారు. పోలింగ్ ఆలస్యం అయిన కారణంగా.. అర్ధరాత్రి వరకు జనసంచారం ఉన్నా.. ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: వైకాపా విధ్వంసం... ఓటింగ్ హింసాత్మకం