ETV Bharat / state

'జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే బెయిల్​పై విడుదలైన వ్యక్తి మృతి'

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే బెయిల్​పై విడుదలైన వ్యక్తి మృతిచెందాడంటూ.. మృతుని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Mar 11, 2021, 2:41 AM IST

పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళన
పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళన

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల బెయిల్​పై విడుదలైన వ్యక్తి మృతి చెందాడంటూ.. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. తిరుమలాయపాలెంకు చెందిన బోయిడి చంద్రం.. నాటు సారా విక్రయం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో రిమాండ్​లో ఉన్న చంద్రం.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జైలు అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బుధవారం బెయిల్​పై విడుదలైన చంద్రంను ఇంటికి తీసుకొస్తుండగా చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు మృత దేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చంద్రం మృతి చెందాడని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గోకవరం-రాజమహేంద్రవరం రహదారిలో ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:

ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.