ETV Bharat / state

నెలక్రితమే వివాహం.. అంతలోనే ముంచుకొచ్చిన మరణం - క్రిష్ణవరం

అతడికి నెలరోజుల క్రితమే వివాహం జరిగింది. ఎన్నో కలలతో, మరెన్నో ఆశలతో భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. పెళ్లి కోసమని తీసుకున్న సెలవులు ముగియగా.. విధుల్లో చేరాడు. అంతలోనే ఆ యువకుడిని జేసీబీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది.

నెలక్రితమే వివాహం.. అంతలోనే విషాదం
author img

By

Published : Jul 14, 2019, 8:15 PM IST

నెలక్రితమే వివాహం.. అంతలోనే విషాదం

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్ణవరం జాతీయ రహదారిపై టోల్​గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. లారీపై జేసీబీ యంత్రాన్ని తరలిస్తుండగా అది టోల్​గేట్ పైకప్పు నిర్మాణానికి తగిలి భవనం కూలిపోయింది. విధి నిర్వహణలో ఉన్న రాజు అనే టోల్ కలెక్టర్ భవన శిథిలాల్లో చిక్కుకున్నాడు. స్థానికులు, ప్రయాణికులు అరగంటపాటు శ్రమించి అతడిని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాధారణంగా భారీ వాహనాలను బయట ద్వారం నుంచి పంపించాలి. అయితే టోల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి లోపలి మార్గం నుంచి పంపించారు. ఈ కారణంగా... ప్రమాదం జరిగి ఉద్యోగి మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహమై.. రెణ్నెల్లు కాలేదు..

అందరితో మంచిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే రాజు మృతి... అక్కడ వారిని కంటతడి పెట్టించింది. ఇటీవలే వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన రాజు హఠాన్మరణం చెందడం.. కుటుంబ సభ్యులు, బంధువులను కలిచివేసింది.

ఇవీ చదవండి..విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి బలవన్మరణం

Bengaluru, Jul 10 (ANI): Karnataka Assembly Speaker K R Ramesh Kumar said that he has not accepted any resignation as yet. He said, "I have not accepted any resignation, I can't do it overnight like that. I have given them time on 17th. I'll go through the procedure and take a decision." He further added, "Today 2 more MLAs have resigned, Dr K Sudhakar and Mr MTB Nagaraj. As in the case of other MLAs, law will take its own course. The law cannot deviate from person to person, it is uniform for one and all."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.