భూమి పాస్ బుక్ ఇచ్చేందుకు రైతు దగ్గర నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటూ.. ఓ వీఆర్వో అనిశా వలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు నాయుడు.. భూమి పాస్ బుక్ కోసం ఓ రైతు వద్ద నుంచి రూ.5వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక రైతు.. అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. రైతు దగ్గర నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనిశా అధికారులు తహసీల్దార్ కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించారు.
ఇదీ చదవండి: