కరోనా కారణంగా మాస్క్ లేకుండా బయట తిరగలేని పరిస్థితి. వైద్యులైతే మాస్కులతోపాటు పీపీఈ కిట్లూ ధరించాల్సిందే. కొన్నిసార్లు డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండడంలేదు. ఒకసారికి మించి ఉపయోగించే సౌలభ్యం లేకపోవడంతో పీపీఈకిట్ల వ్యర్థాలు..... కుప్పల్లా పేరుకుపోతున్నాయి. దానివల్ల... పర్యావరణ కాలుష్యానికి, ఇతర వ్యాధులకు హేతువుగా మారే ప్రమాదాలు లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగా తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు.... ఓ విన్నూత్న ఆవిష్కరణ చేశారు. అదే పోర్టబుల్ ఆప్టికల్ క్యావిటీ స్టైరిలైజేషన్ యూనిట్..
పీపీఈ కిట్ల పునర్వినియోగం..
తిరుపతి ప్రపంచ వ్యాప్తంగా నెలకు 200 బిలియన్ల పీపీఈ కిట్లు తయారు చేసి,. వినియోగించి, వ్యర్థాలుగా విసేరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వినియోగించిన వాటిలో 75శాతం ఫేస్ మాస్క్‌లు మాత్రమే వ్యర్థ నిర్వహణ కేంద్రాలకు చేరుతున్నాయని ఐరాస చెప్తోంది. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేలా తిరుపతి ఐఐటీ తరపున ఆలోచనలు చేసి..... ఈ పరికరానికి రూపకల్పన చేశాం. తద్వారా పీపీఈ కిట్ల పునర్వినియోగంతో పాటు.... ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే పీపీఈ వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడగలుగుతాం.
ఐఐటీ డైరైక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ సలహాలు, సూచనలతో... భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. రితీష్ కుమార్ గంగ్వార్, డా.ఆర్జిత్ శర్మ, సివిల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. షిహబుద్దీన్ ఎం మాలియకల్ ఈ ముగ్గురూ కలిసి ఈ పరికరానికి రూపకల్పన చేశారు. అతినీల లోహిత కిరణాలవినియోగంతోపాటు, కోల్డ్ ప్లాస్మా, H2O2 వినియోగించి వస్తువులను శుద్ధి చేసేలా డిజైన్ చేశారు...
తిరుపతి అతినీలలోహిత కిరణాలు, హెచ్‌టూవోటూ ఉపయోగించి. .. ఈ యూనిట్ కి రూపకల్పన చేశాం. వస్తువులను తడి చేసి శుద్ధి చేసేలా ఓ పరికరాన్ని, పొడిగా ఉండే పరిస్థితుల్లో శుద్ధి చేసేలా.... మరో పరికరాన్ని తయారు చేశాం. శుద్ధి ప్రక్రియలో భాగంగా.. . అతినీల లోహిత కిరణాలు ఎంత సేపు వస్తువులపై పడాలి. హెచ్ టూ వో టూ ఎంత సేపు, ఎన్ని సార్లు స్ర్రే అవ్వాలి అనివినియోగదారుడే ఎంచుకునే వీలుంది. ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత.. రెండు మూడు సెకన్లలో వస్తువులను శుభ్రం చేసే ప్రక్రియ మొదలవుతుంది.
-డా.రితీష్ కుమార్ గంగ్వార్ అసిస్టెంట్ ప్రొఫెసర్,
సాధారణంగా బయట లభ్యమయ్యే పరికరాల్లో యూవీ కిరణాలు బల్బు ద్వారా ఒకే దగ్గర ప్రసరితమవుతాయి. కనుక పరికరంలో... ఆ పరిధిలోనే వస్తువులను పెట్టి శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. పైగా అతినీల లోహిత కిరణాల తీవ్రత తక్కువగా ఉండటం వల్ల.....కేవలం వస్తువు బాహ్యఉపరితలం మాత్రమే శుద్ధి అవుతుంది. ఈ లోపాలను అధిగమించేలా.... ఈ పరికరంలో కీలక మార్పులు చేశారు.
తిరుపతి మార్కెట్లో ఇప్పటికే అతినీలలోహిత కిరణాలతో శుద్ధి చేసే పరికరాలున్నాయి. కానీ వాటిలో యూవీ కిరణాలు కేవలం ఒక్కచోటే ప్రసారమవుతాయి. కానీ ఈపరికరంలో.... ఫోటాన్ ఫ్లక్స్ ట్రాపింగ్ తో వస్తువులున్న అన్నిప్రదేశాల్లోనూ అతినీల లోహిత కిరణాలు ప్రసారమయ్యేలా వీలు కల్పించాం. కాంతి పరివర్తనం చెందేలా ప్రతిబింబించే రేకులు ఉపయోగించి అన్నిచోట్ల కాంతి పడేలా ఏర్పాట్లు చేశాం. అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ ప్రక్రియ ద్వారా ఓహెచ్ బేస్ ను వినియోగించి వీలైనంత తొందరగా ఈ శుద్ధి ప్రక్రియ పూర్తవటంతోపాటు వందశాతం పూర్తిగా శుభ్రమయ్యేలా... పరికరాన్ని తయారు చేశాం.
-డా.రితీష్ కుమార్ గంగ్వార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ-
దాదాపు మార్చి నుంచి ఈపరికరంపై దృష్టి సారించిన ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్లు...... అనేక మార్పులు చేశారు. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశామని, ప్రక్రియ పూర్తవగానే మార్కెట్లోకి తెచ్చేలా కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
తిరుపతి మొబైల్ ఫోన్లు, ఆహార పదార్థాల ప్యాకెట్లు ఇలా వేర్వేరు వస్తువులను శుద్ధి చేసుకునేలా..ఈ పరికరం రూపకల్పన చేశాం. తడి, పొడి పరిస్థితులకు వేర్వేరుగా పరికరాలను అందుబాటులోకి తెస్తున్నాం. వేరే యూవీ యూనిట్లతో పోల్చుకుంటే మేం తయారు చేసిన పరికరంలో.. అతినీలలోహిత కిరణాల ప్రసారం లోపల మొత్తం జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నాం. కాంతిని పరావర్తనం చెందించే, ప్రతిబింబించే రేకుల ద్వారా వేరే పరికరాలతో పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది.
-డా.ఆర్జిత్ శర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ-
ఇప్పటికే ఓ యూనిట్‌ను తిరుపతి అమర్ రాజా పరిశ్రమలో పెట్టి..అక్కడ పనిచేసే ఉద్యోగుల పీపీఈ కిట్లను పునర్వియోగించుకునేలా అవకాశం కల్పించారు..
ఇదీ చూడండి.