తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం హుండీ ఆదాయం 2 కోట్ల 93 లక్షలు దాటింది. ఇందులో చిల్లర పరకామణీనే 85 లక్షలు రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతుండటం.. అదే స్థాయిలో హుండీ ఆదాయం వస్తుంది.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయటం ప్రారంభించిన తితిదే.. మెుదట రోజుకు 3 వేల టోకెన్లు కేటాయించారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో మరో రెండు వేలు పెంచి మెుత్తం 5 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
భక్తులు సమర్పించుకునే కానుకలు, మెుక్కులతో హుండీ ఆదాయం సైతం గణనీయంగా పెరుగుతోంది. అక్టోబర్ 31న 24,421 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.1.45 కోట్లు నమోదైంది. నవంబర్ 1న 27,107 మంది స్వామివారి దర్శనం చేసుకోగా ఒక్కరోజే 2.22 కోట్ల రూపాయల హుండీ సమకూరింది.
ఇదీ చదవండి: