చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. చంద్రగిరి మండల టీఎస్ఎన్వీ అధ్యక్షుడి అరెస్టుకు నిరసనగా తేదేపా నాయకులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపించారు.
తెదేపా కార్యకర్తలు, నాయకులు... వైకాపా నాయకుల ప్రలోభాలకు లొంగక పోతే... వారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సివిల్ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని చట్టాలు చెబుతున్నా.. పోలీసులు బేఖాతరు చేస్తూ నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఇంచార్జ్ డీఎస్పీ రాజశేఖర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వటంతో... తెదేపా నాయకులు ఆందోళనను విరమించి డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: