ETV Bharat / state

పెద్దేరు కన్నీరు.. ఇసుకనంతా తోడేస్తున్నారు

రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డే లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకూ.. ఎన్నికలు, తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి చర్యలతోనే గడిచిపోయింది. ఇదే అనుకూలంగా మలుచుకున్న ఇసుకాసురులు.. రెచ్చిపోతున్నారు.

ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Jul 18, 2019, 2:08 AM IST

ఇసుక అక్రమ రవాణా

పట్టించుకునేవారు లేకపోవడం, అధికారుల నిఘా లోపించడం ఫలితంగా.. రాయలసీమలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల పరిధిలోని తంబళ్లపల్లె, కదిరి, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రవహించే పాపాగ్ని, పెద్దేరు, చిన్న ఏరు, కుశావతీ నదులతో పాటు.. వాటి పాయల్లో నిండిన ఇసుక.. అక్రమార్కులపరమవుతోంది. గడచిన పదేళ్లలో వర్షాలు లేని కారణంగా వాగులు, వంకలు, నదులు పూర్తిగా ఎండిపోయాయి.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దేరు నది.. కర్ణాటక సరిహద్దు నుంచి పి.టి.ఎం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మీదుగా ప్రవహించి కడప జిల్లాలోని గాలివీడు, వెలిగల్లు జలాశయం వరకు సాగుతుంది. ఈ ప్రాంతంలో ఇసుక నిల్వలు భారీగా ఉన్నాయి. చుక్కనీరు లేకుండా ఎండిన పాయలలో ఇసుకను స్మగ్లర్లు తోడేస్తున్నారు. పెద్దేరు పరివాహక ప్రాంతాల ప్రజలు, వ్యవసాయం చేసుకునేవారు, తాగునీటి పథకాల బోర్లు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అధికారులెవరూ అందుబాటులో లేకపోవడం, సిబ్భంది సైతం నిఘా పెట్టని ఫలితం.. యథేచ్ఛగా ఇసుక వ్యాపారం కోట్లల్లో కొనసాగేందుకు దారి చూపింది.

ఇసుక దందాలపై.. సమాచారం ఇవ్వడానికీ సంబంధిత ప్రాంతాలలో ప్రజలు, గ్రామస్థాయి సహాయ అధికారులు భయపడుతున్నారు. ప్రస్తుతం అన్ని మండలాల్లో అధికారుల బదిలీలతో పాలన గాడి తప్పింది. గడచిన ఆరు నెలలుగా ఎన్నికల నిర్వహణతో పాటు బదిలీల పర్వం లాంటి పరిణామాల ఫలితంగా... అక్రమ రవాణా మరింత పెరిగిపోయింది. ఇకనైనా ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోకపోతే.. వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Intro:slug: AP_CDP_36_16_GURUPOURNAMI_AV_AP10039
contributor: arif, jmd
గురుపౌర్ణమి వేడుకలు
( ) కడప జిల్లా జమ్మలమడుగులో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ముద్దనూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయి బాబా మందిరం లో గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు .మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారుజామున మంగళ హారతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి .విగ్నేశ్వర పూజలు, హోమాలు నిర్వహించారు. జమ్మలమడుగు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై సాయి బాబాను దర్శించుకున్నారు.

Body:జమ్మలమడుగు గురుపౌర్ణమి వేడుకలు

Conclusion:జమ్మలమడుగు గురుపౌర్ణమి వేడుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.