తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వైకుంఠం నుంచి రామ్‌బగీచా వసతి గృహం వరకు సర్వదర్శనం క్యూలైన్లు పెరిగాయి. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ఇవాళ శ్రీవారిని 70,600 మంది భక్తులు దర్శించుకోగా... శ్రీవారి హుండీకి రూ.3.2 కోట్లు ఆదాయం లభించింది.
టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ నిలిపివేత
శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం దివ్యదర్శనం, సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీని తితిదే అధికారులు నిలిపివేశారు.