ETV Bharat / state

Robbery in Tirupati: తిరుపతిలో భారీ చోరీ - Robbery

చోరీ
చోరీ
author img

By

Published : Sep 23, 2021, 3:08 PM IST

Updated : Sep 23, 2021, 5:31 PM IST

15:03 September 23

రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం అపహరణ

తిరుపతి నగరంలోని రాయల్​నగర్​లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి గోపాల్ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు రూ.11 లక్షల నగదుతో పాటు 400 గ్రాముల బంగారం అపహరించారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గోపాల్.. భార్యతో కలిసి రాయల్​ నగర్​లో నివాసముంటున్నారు. గోపాల్​ భార్య పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్ చేసిన సుమారు 11 లక్షల రూపాయలను గృహనిర్మాణం కోసం తీసుకొచ్చారు. రాత్రి ఇంటిలో పెట్టుకున్న సమయంలో దొంగలు పడి 11 లక్షల నగదుతో పాటు బంగారాన్ని దోచుకెళ్లారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్​.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన వెంట భార్య పద్మావతి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో  దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఉద్యోగం రాకపోవడంతో.. ఆ విధంగా డబ్బు సంపాదించాలని...!

Last Updated : Sep 23, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.