తిరుపతి ఆటోనగర్లో రసాయన డ్రమ్మును గ్యాస్ కట్టర్తో కోస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో జయరాం అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. దుకాణం వద్ద కెమికల్ డ్రమ్మును గ్యాస్ కట్టర్ సాయంతో జయరాం కోసేందుకు ప్రయత్నించాడు. డ్రమ్ములో ఇంకా రసాయనం మిగిలి ఉండటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి... జయరాంకు అంటుకున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పి, జయరాంను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు