చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం కళ్యాణపురం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నబ్బ.. కళ్యాణపురం అటవీ ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉంటూ జీవనం సాగించేవాడు. గత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏనుగు తోటలోనికి ప్రవేశించి కాపలాగా ఉన్న చిన్నబ్బను తొండంతో కొట్టడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంతో కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: రాత్రింతా రోడ్డుపైనే నిద్రించిన కరోనా రోగి.. పట్టించుకోని ఆస్పత్రి