ETV Bharat / state

అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. పలువురు అరెస్ట్​

తిరుపతి దిగువ ఘాట్ వద్ద జూడాల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎన్ఎమ్​సీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాతో...అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు నిలిచిపోవడం వలన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో తరలించారు.

అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. అదుపులోకి తెచ్చిన పోలీసులు
author img

By

Published : Aug 7, 2019, 3:24 PM IST

Updated : Aug 7, 2019, 5:59 PM IST

అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. అదుపులోకి తెచ్చిన పోలీసులు

తిరుపతి దిగువ ఘాట్‌ వద్ద జూడాలు ఆందోళనకు దిగారు. కేంద్రం తీసుకువచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్​సీ) బిల్లుకు వ్యతిరేకంగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద జూడాలు భారీ ధర్నా చేపట్టారు. జూడాలు, వైద్య విద్యార్థులు తిరుమల రహదారిని దిగ్బంధం చేశారు. జూడాల ధర్నాతో కొండపైకి వెళ్లే వాహనాలు, బస్సులు నిలిచిపోవటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పైనుంచి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన జూడాలను పోలీసులు, భక్తులు పక్కకు లాగేశారు. ఈ ఘటనతో అలిపిరి రహదారిలో ఉద్రిక్తత నెలకొంది. తిరుమల దారిలో 3 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. ఘాట్ రోడ్లను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రేపట్నుంచి నిరాహార దీక్ష చేస్తామన్న జూడాలు, వైద్య విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : అనధికార పన్ను వసూళ్లలో 'జే' కమీషన్ ఎంత..?

Intro:మదనపల్లిలో ఆక్రమణలు తొలగింపు

Body:అత్యంత విలువైన భూములను స్వాధీనం చేసుకున్న చేసుకున్న రెవెన్యూ అధికారులు

Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆక్రమణ ల పై అధికారులు కొరడా ఝులిపించారు రు అత్యంత విలువైన భూములను ఆక్రమించుకుని చేపట్టిన స్థలాలను కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు మదనపల్లె పట్టణం శివారు ప్రాంతాలైన జీకే పల్లి చంద్ర కాలనీ గుట్ట గుట్ట తదితర ప్రాంతాల్లో ఆక్రమించుకున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇందులో నిర్మించుకున్న పునాదులు ఇళ్లను కూల్చివేసి చదును చేశారు నలుగురు మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపట్టారు జెసిబి లను తీసుకొచ్చి నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు ఈ ప్రాంతంలో కోట్లు విలువ చేసే సుమారు 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిని ప్రజా ఉపయోగాలకు ప్రభుత్వ అ కార్యక్రమాలకు వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య అధికారులు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు
Last Updated : Aug 7, 2019, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.