Ex Central Minister Chinta Mohan On YSRCP Govt: రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందని దుస్థితి దాపురించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర పథకాలకు తన పేర్లు పెట్టుకుని జనాన్ని మోసగిస్తున్నారన్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. 2024లో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి