ETV Bharat / state

'ప్రశాంత వాతావరణంలో ఉపఎన్నిక జరిగేలా ఏర్పాట్లు చేస్తాం'

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నిర్వహణపై అధికారులతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

chithore district joint collector
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం
author img

By

Published : Mar 29, 2021, 7:28 PM IST

ప్రశాంత వాతావరణంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అవినీతిని అరికట్టేందుకు అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి, పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని జేసీ అన్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీనియర్ సిటిజన్ల కోసం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని సహాయక ఆర్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 997 కొవిడ్‌ కేసులు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.