'రోమ్ కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు' ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలి ఉందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఎద్దేవా చేశారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం జగన్ బడులు, గోడలు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
పెద్ద ఆసుపత్రులకు వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సత్వరమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే.. పాఠశాలలు, గోడలపై బొమ్మలు గురించి సీఎం జగన్ చర్చించటం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు