ETV Bharat / state

మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతల ఫిర్యాదు

తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కందులవారిపల్లి సర్పంచ్ లక్ష్మీ, చంద్రగిరి తెదేపా నేతలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచం మెచ్చిన చంద్రబాబును.. నారా 420 వైరస్, నారావారిపల్లిలో పుట్టిందని అవమానకరంగా మాట్లాడడం బాధకరమన్నారు.

Chandragiri TDP leaders' complaint against Kodali Nani

author img

By

Published : May 11, 2021, 2:01 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందువవారిపల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీ , టీఎస్ఎన్వీ మండల అధ్యక్షుడు రాకేష్ చౌదరిలు మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ చౌదరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నారా వారిపల్లిలో 70 ఏళ్ల కిందట నారా 420 వైరస్ పుట్టిందని గ్రామాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నారా వైరస్ అంటూ.. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి గ్రామస్థుల మనోభావాలను దెబ్బ తీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ గ్రామ ప్రజలందరి తరుపున రాకేష్ చౌదరి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

ఇదీ చదవండి

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.