చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద మూషిక పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానిస్తూ పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణగా సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి స్వామివారు హంస వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు.
* వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
రూ.కోటితో నూతన స్వర్ణ నెమలి వాహనం: బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఊరేగింపునకు రూ.కోటితో నూతనంగా స్వర్ణ నెమలి వాహనాన్ని తయారు చేయించినట్లు నెమలివాహన ఉభయదారులు తెలిపారు. 1.6 కిలోల బంగారం, వంద కిలోల రాగిని వినియోగించారని చెప్పారు. శుక్రవారం రాత్రి స్వామివారి ఊరేగింపులో ఈ వాహనాన్ని వినియోగించనున్నారు.
ఇవీ చదవండి: