చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రీ నారాయణ నివాసంలో.. గురువారం వేకువజామున దొంగలు ప్రవేశించారు. బీరువాలో బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బద్రీ నారాయణ కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగానే దొంగలు చాకచక్యంగా ఈ పనికి ఒడిగట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా వేలి ముద్రలు సేకరించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు.
ఇదీ చదవండి: యజమానికి గమస్తా నమ్మక ద్రోహం.. 10 కేజీల బంగారం చోరీ