ETV Bharat / state

చంద్రకళా... డెంగీ ఎంత పని చేసిందమ్మా..?! - a bride died due to dengue in Chittur district of andhrapradesh

పెళ్లికూతురుగా ముస్తాబైన యువతిని.. విష జ్వరం కబళించింది. డెంగీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు.. పెళ్లింట చావు బాజా మోగేలా చేసింది. అక్టోబరు 30న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకుని.. పనులన్నీ పూర్తైన దశలో.. ఆ యువతి జీవితం అర్థంతరంగా ముగిసింది.

bride due to dengue
author img

By

Published : Nov 2, 2019, 10:04 AM IST

Updated : Nov 2, 2019, 12:11 PM IST

డెంగీతో పెళ్లికూతురు మృతి

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం నరసింహాపురం గ్రామంలో.. విష జ్వరం తీరని విషాదం నింపింది. కృష్ణమరాజు, రెడ్డమ్మ దంపతులు తమ కుమార్తె చంద్రకళకు గత నెల 30 పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలో.. చంద్రకళకు డెంగీ సోకింది. పరిస్థితి విషమించింది. తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చేర్పించగా.. రెండు రోజుల పాటు జ్వరంతో చంద్రకళ పోరాడింది. ఇంతలో పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. బంధుమిత్రులు, గ్రామస్తులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. కానీ.. ఆస్పత్రి నుంచి చంద్రకళను పంపేందుకు వైద్యులు నిరాకరించారు. పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలతో.. 'మీ ఇష్టం' అని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడిన చంద్రకళ ఆరోగ్యం.. ఆ తర్వాత మరింత దిగజారింది. పరిస్థితి చేయిదాటి.. ఆమె కన్నుమూసింది. పచ్చని పారాణితో పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రకళ.. ఇలా అర్థంతరంగా తనువు చాలించడం బాధిత కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Intro:చిత్తూరుజిల్లా పాలసముద్రం మండలంలో పెళ్లికూతురుకు డెంగ్యూ జ్వరం సోకి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.Body:Ap_tpt_36_02_dengyuto_pellikuturu_mruti_av_ap10100

నిండు నూరేళ్లు ముడుముళ్ల బంధంతో, శుఖసంతోషాలతో జీవితాన్ని గడపాల్సిన పెళ్లికూతురును డెంగ్యూ జ్వరం కబళించింది.చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం లోని నరసింహాపురం పంచాయతీకి చెందిన కృష్ణమరాజు-రెడ్డెమ్మల కుమార్తె చంద్రకలకు గతనెల 30వ తేదీన పెళ్లిచేసేందుకు పెద్దలు ఏర్పాట్లు చేశారు.ఇంతలో ఆమెకు డెంగ్యూ జ్వరం సోకింది.రెండురోజులపాటు జ్వరంతో పోరాడి చివరకు చంద్రకళ మృతిచెందింది.ఈ సంఘటనతో గ్రామాస్తులలో, బందువులలో విషాదం నెలకొంది.పచ్చని పారాణితో పెళ్లి పీటలేక్కబోతున్న వధువు ..... తనువు చాలించి పాడి ఎక్కడంతో ఇరుకుటుంబాలలో విషాదం నెలకొంది.

నోట్: ఈ సంఘటన నిన్నరాత్రి జరిగింది..... వార్త మిస్సవకూడదనే ఈ రోజు పంపుతున్నాము. పాలసముద్రం రిపోర్టర్ అందుబాటులో లేడు. అందువల్ల నేను పంపవలసి వచ్చింది గమనించగలరు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Nov 2, 2019, 12:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.