వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయం చేసేందుకు జగన్ ఒక జిమ్మిక్కు చేసి..సహజ మరణంలా చిత్రీకరించారని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. వివేకానంద కుమార్తె సిట్‌పై నమ్మకం ఉందని...తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దని వ్యాఖ్యానించారు..అంటే ఆమె మాట్లాడన మాటలుజగన్ గురించి కాదా అని వర్లప్రశ్నించారు. చెల్లి సునీతను బెదిరించిన సంగతి నిజం కాదా..అనిఅన్నారు సిట్ పై నమ్మకం ఉందంటూనే..ఆమె తనకు భయం ఉందని కేంద్ర ఎన్నికల అధికారిని కలవాలని అపాయింట్మెంట్ తీసుకుంది. జగన్, విజయసాయి రెడ్డిలే ఆమెను భయపెట్టారని వర్ల పేర్కొన్నారు.రాజకీయం కోసం శంకరయ్య అనే సర్కిల్ ఇన్ స్పెక్టర్ బలయ్యారని..దానికి కారణం జగనేనని ఆయన అన్నారు.
ఈ కేసులో జగన్ మోహన్‌రెడ్డి గుట్టుంతా బయటికొస్తుందని స్థానికపోలీసులే దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటారన్నారు. హత్య తరువాత రక్తం కడిగింది జగన్ సూచనలతోనేనని...అంటే అన్నింటికీ సూత్రధారి జగనేనని వర్ల విమర్శించారు. దిల్లీలో సీఈసీ, హోం సెక్రటరీ దగ్గర సునీతతో జగన్ చెప్పించినవన్నీ అబద్దాలేనని వర్ల దుయ్యబట్టారు. హత్యారాజకీయాలకు మూలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వర్ల వ్యాఖ్యానించారు.