ETV Bharat / state

రాష్ట్రంలో నేడూ.. భానుడి భగభగలు

రాష్ట్రంలో నేడూ..భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో నేడూ.. భానుడి భగభగలు
author img

By

Published : May 31, 2019, 7:25 AM IST

నేడు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతవారణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించొచ్చని స్పష్టం చేశారు. కోస్తా జిల్లాల్లో మరో 2 రోజులపాటు ఈ తీవ్రత ఉంటుందని అంచనా వేశారు. రానున్న 4 రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, ఒడిశాను ఆనుకుని దక్షిణ చత్తీస్​ఘడ్ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు వివరించారు.
జూన్ రెండో వారంలో రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు జూన్ 8,9 తేదిల్లో రాయలసీమను తాకే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు స్పష్టం చేశారు. జాన్ 4,5వ తేదిన కేరళను తాకి తర్వాత మరో నాలుగైదురోజుల్లో ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. తొలుత రాయలసీమ జిల్లాల్లో రుతుపవనాలు ప్రభావం చూపి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు.

ఇదీచదవండి

ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

Intro:ap_cdp_16_29_cm_jagan_pedda_darga_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప పెద్ద దర్గా సందర్శించారు. దర్గా వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెద్ద దర్గాకు వచ్చారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆయన తలపై పూల చాందిని పెట్టుకొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకొని కడప విమానాశ్రయం టు బయలుదేరి ప్రత్యేక విమానంలో పులివెందులకు బయలుదేరుతారు. ఓట్ల లెక్కింపు అనంతరం జగన్ మొదటిసారిగా కడపకు రావడంతో భారీ సంఖ్యలో అభిమానులు ప్రజలు జగన్ను చూసేందుకు తరలి వచ్చారు. దర్గా ఆవరణమంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది. జగన్ వెంట పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Body:పెద్ద దర్గా జగన్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.