రైతుల నుంచి ధాన్యం సేకరించి వారికి డబ్బులు చెల్లించలేదని ఏలూరి సాంబశివరావు అన్నారు. వారికి ఇవ్వాల్సిన 575 కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ... గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైందన్నారు. గత బడ్జెట్‌లో పౌరసరఫరాలశాఖకు రూ.3వేల కోట్లు కేటాయించి... కనీసం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం 970 కోట్లు పెండింగ్లో పెట్టిందన్నారు. నాలుగైదు రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి