పోస్టల్ బ్యాలెట్ విధానం!
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం-12 అందజేస్తారు. ఈ దరఖాస్తు నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల ఫెలిసిటేషన్ కేంద్రంలో అందజేయాలి. ఫారం-12తోపాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు నకలు జతచేయాలి. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో... ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు.
పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కు వినియోగించుకొని... ఫారం-13 పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్‌తోపాటు ధ్రువీకరణ పత్రం... 13ఏ గెజిటెడ్ అధికారి సంతకంతో డ్రాప్ బాక్స్‌లో వేయాలి. అక్కడ వీలు కాకపోతే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లోనూ వేసే వీలు కల్పించారు. అదీ కుదరని పక్షంలో నిర్దిష్ట సమయంలో పోస్ట్‌ద్వారా రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు. పోలింగ్‌కు 7 రోజులు ముందు వరకు ఫారం-12, సంబంధిత పత్రాలు అందజేసి.. రిటర్నింగ్ అధికారి నుంచి పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు.
పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి కారణాలు...
*ఆర్‌ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై అనాసక్తి
*ఫారం-12తో సకాలంలో అందకపోవడం
*ఓటరు జాబితాలోని వివరాలు ఫారం-12లో సరిగా జత చేయకపోవడం
*విధుల్లో పాల్గొనే వారికి ఉత్తర్వులు సరైన సమయంలో రాకపోవడం
*తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను గడువులోగా ఆర్‌ఓకు పంపకపోవడం
పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణకు ప్రధాన కారణాలు...
*ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగుల డిక్లరేషన్‌లో సంతకం లేకపోవడం
*బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం
*ఓటేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13-బీ కవరులో పెట్టకపోవడం
*పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ ఒకే కవరులో పెట్టడం