ముఖ్యమంత్రి జగన్ తానే స్వయంగా ప్రజానీకాన్ని కలిసి.. వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం నుంచి ప్రారంభం కావలసిన ఈ కార్యక్రమం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు పూర్తికానందున వాయిదా వేేశారు. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆగస్టు 1నుంచి నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలను ప్రతిరోజూ ఒక గంటపాటు కలుసుకోవాలని నిర్ణయించారు.