బయో మెట్రిక్ ఆధారంగానే ఉద్యోగులకు ప్రభుత్వం జీత భత్యాలు చెల్లించనుందని సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకువచ్చారు. ఈతప్పుడు ప్రచారాలను ఉద్యోగులు నమ్మొద్ధని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానం కేవలం ఐచ్చికమేననిప్రకటించారు. ఉద్యోగులు కోరిక మేరకే ఈ సర్వీస్ రిజస్టర్ల విధానాన్ని తీసుకువచ్చామని అన్నారు. పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ చెల్లించడంజరుగుతుంది.జీత భత్యాలకు, బయో మెట్రిక్‌కు, ఈ సర్వీస్ రిజస్టర్లకు ఎటువంటి సంబంధం లేదనిస్పష్టం చేశారు. ఉద్యోగుల సర్వీసు 30 ఏళ్లు పూర్తి కాగానే స్వచ్ఛంధ పదవీ విరమణ చేయించనున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెల్చి చెప్పారు.ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్షంగా వ్యవహరించదని తెలిపారు.దుష్ప్రచారాన్ని ఉద్యోగులు తిప్పి కొట్టాలని ఆయన కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'బయోమెట్రిక్‌తో జీతాలకు సంబంధం లేదు'
బయోమెట్రిక్ ఆధారంగానే ఉద్యోగులకు ప్రభుత్వం జీత భత్యాలు చెల్లించనుందని సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. బయోమెట్రిక్‌తో జీతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.