ETV Bharat / state

గాడిద పాలు 5 మిల్లీలీటర్లు @ 100 రూపాయలు.. ఎగబడుతున్న జనం

DONKEY MILK IN ADDANKI : చాలా మంది పొట్టకూటి కోసం తాము ఉంటున్న ప్రాంతాల నుంచి మరో చోటుకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పొట్టలు నింపుకుంటారు. అయితే అందరిలాగే పని చేసుకుంటే కిక్​ ఏముంది అనుకున్నారో ఏమో కానీ.. వాళ్లతో పాటు తమ గాడిదలను తీసుకుని వెళ్లి వాటి పాలతో లాభం పొందుతున్నారు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

DONKEY MILK
DONKEY MILK
author img

By

Published : Dec 19, 2022, 3:20 PM IST

DONKEY MILK : గాడిద పాలలో చాలా పోషకాలు ఉంటాయని తెలుసు. వాటిని తాగడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు బాగు అవుతాయని నమ్ముతారు. అయితే గాడిద పాలు దొరకడం చాలా అరుదు. కాకపోతే ఇక్కడ గాడిదపాలు పిండి ఇస్తాం అంటూ గాడిదలతో తిప్పుతూ.. కంటి ముందే పాలు పిండి అమ్ముతున్నారు. ఈ సంఘటన చూసి బాపట్ల జిల్లా అద్దంకి వాసులు ఆశ్చర్యపోతున్నారు. 5 మిల్లీ లీటర్ల పాలు వంద రూపాయలకు అమ్ముతున్నారు.

లీటరు గాడిద పాల ధర సుమారు 10 వేల రూపాయలు పలుకుతుంది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి వచ్చిన 15 వలస కుటుంబాలు గాడిద పాలు అమ్ముతున్నారు. గాడిద పాలు తాగటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, శరీరానికి మంచిదని చెప్పి మరీ అమ్ముతున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యం కోసం కొనుక్కుంటే, మరికొంత సరదాగా కొనుక్కొని తాగుతున్నారు.

అక్కడ గాడిదపాలు.. 5మిల్లీలీటర్లు @100 రూపాయలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.