ETV Bharat / state

స్థానిక సమరానికి అధికార యంత్రాంగం సంసిద్ధం - అనంతపురం మునిసిపల్ ఎన్నికలు 2020

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు, రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈనెల 17న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేసిన అధికారులు బ్యాలెట్ పేపర్​​ ఇప్పటికే సిద్దం చేశారు. కర్నూలు జిల్లా నుంచి 42 టన్నుల పింక్, తెల్ల పేపర్ బ్యాలెట్ అనంతపురం జిల్లా కేంద్రానికి చేరింది.

zptc-local-elactions-in-ananthapuram-andhrapradesh
స్థానిక సమరానికి అధికార యంత్రాంగం సంసిద్ధం
author img

By

Published : Jan 11, 2020, 10:32 AM IST

స్థానిక సమరానికి అధికార యంత్రాంగం సంసిద్ధం

అనంతపురంలో జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు పూర్తై... జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్​ను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్​కు సమర్పించారు. అనంతపురం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయిస్తూ ఖరారు చేశారు. ఈనెల 17న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాతో... ఎన్నికలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎన్నికలు రెండు విడతలు...!
జిల్లాలో 849 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 63 మండలాల్లో 63 జడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వేర్వేరుగా ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులకు వినియోగించే బ్యాలెట్... తెలుపు, పింక్ రంగుల్లో ఉండనుంది. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. వయోజనులు కొత్తగా జాబితాలో చేరుతున్నందున ఎప్పటికప్పుడు జాబితాను నవీకరిస్తున్నారు. ఇప్పటివరకూ సిద్దమైన ఓటర్ల జాబితా మేరకు... జిల్లావ్యాప్తంగా 23 లక్షల 63వేల ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అవసరమైతే కేరళ నుంచి...
ప్రస్తుతం ఉన్న బ్యాలెట్ పెట్టెలకు అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు. అదనంగా అవసరమైతే కేరళ నుంచి తెప్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం తమ అభ్యర్థులను ఎంపికకు రాజకీయ పార్టీలు అంతర్గతంగా సమాలోచనలు జరుపుతున్నాయి.
నోటిఫికేషన్ విడుదల అయ్యాక పలు విషయాలపై స్పష్టత రానుంది. అటు రాజకీయ పార్టీలు, జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.

ఇవీ చూడండి-'మీడియా కథనాలు చూసైనా సీఎంలో మార్పు రావాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.