అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని బాలసముద్రం పంచాయతీ గోవిందు వారిపల్లి వెలుగు యానిమేటరు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కరస్పాండెంట్ గా పనిచేస్తున్న జయలక్ష్మి గ్రామంలోని చరిత వివో సంఘంలోని 7 సంఘాల నుంచి రూ 25 లక్షల 75వేల నగదును వసూలు చేసి ఆ నగదును మాయం చేసింది. సంఘంలోని సభ్యులు కొత్త రుణాలు తీసుకునేందుకు బ్యాంకు దగ్గరకు వెళ్లగా అక్రమం వెలుగుచూసింది. విచారణ చేపట్టిన వెలుగు ఏపీఎం డబ్బులు మాయమైన సంఘటన నిజమని తేల్చారు.
ఇదీ చదవండి