అనంతపురం జిల్లా రొళ్ళ మండలం నాసేపల్లిలో ఓ వృద్ధునిపై చిరుత దాడి చేసింది. పాతన్న అనే వృద్ధుడు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సమయంలో... అతనిపై చిరుత దాడికి పాల్పడింది. కాపాడండి అని వృద్ధుడు కేకలు వేయగా.. అతని అరుపులు విన్న చిరుత అతణ్ని.. వదిలి పరారైంది. వృద్ధుని కాలికి గాయమవ్వడంతో వృద్ధుణ్ని గ్రామస్థులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగానే ఉన్నాడు. అటవీశాఖ అధికారులు వృద్ధుణ్ని పరామర్శించి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: