అనంతపురం జిల్లా మేడాపురంలో.. ఇంటి స్థలాల పంపిణీకి వచ్చిన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అర్హులైన తమకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యేను బాధితులు నిలదీశారు. రాత్రికి రాత్రే స్థానిక వైకాపా నాయకులు, అధికారులు జాబితాలో పేర్లు లేకుండా చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి పార్టీ తరఫున ప్రచారాలు చేస్తే.. చివరికి తమకే పట్టాలివ్వలేదని మండిపడ్డారు. పట్టాలు ఎవరికిచ్చారనే విషయం కూడా మీరు పరిశీలించరా? అని ఆయనను ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...