ETV Bharat / state

రాష్ట్రంలో అభివృద్ధి కన్నా.. అవినీతే ఎక్కువ: ఎమ్మెల్సీ తిప్పేస్వామి - ఎమ్మెల్సీ తిప్పేస్వామి కామెంట్స్

అనంతపురం జిల్లాలో పురఎన్నికల ప్రచారం జోరందుకుంది. మడకశిర నగర పంచాయతీలోని వార్డుల్లో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల వైకాపా పాలన వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కన్నా.. అవినీతే రాజ్యమేలుతోందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

tdp mlc thippa swamy municipal elections campaign
ఎమ్మెల్సీ తిప్పేస్వామి
author img

By

Published : Mar 5, 2021, 5:46 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీలోని..2, 3, 8, 9, 10 వార్డుల్లో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రచారం చేపట్టారు. ప్రచారానికి ముందు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి కోసం ఓటు వేయండి..
రెండేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కన్నా.. అవినీతే రాజ్యమేలుతోందని ఎమ్మెల్సీ మండిపడ్డారు. మడకశిర పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆపారని ఆరోపించారు. 20 శాతం పూర్తయిన రింగ్ రోడ్డు పనులను రద్దు చేశారని తెలిపారు. డైలీ మార్కెట్ నిర్మాణ పనులను ఆపి.. దాన్ని రద్దు చేశారని వివరించారు. మడకశిరలో అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఎద్దులను ఎత్తుకెళ్లిన దుండగులు.. జీవనాధారం కోల్పోయిన దంపతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.