ETV Bharat / state

ఉపాధ్యాయురాలి అసభ్య పదజాలం... మంత్రికి ఫిర్యాదు - కస్తూరిభాగాంధీ బాలిక విద్యాలయం

ఉపాధ్యాయురాలు తమను దుర్భాషలాడుతున్నారని సోమందేపల్లి మండలంలోని కస్తూరిభాగాంధీ పాఠశాల విద్యార్థులు... మంత్రి శంకర్ నారాయణకు ఫిర్యాదు చేశారు.

ఉపాధ్యాయురాలి అసభ్యపద జాలం...మంత్రికి ఫిర్యాదు
author img

By

Published : Aug 8, 2019, 7:30 AM IST

Updated : Aug 8, 2019, 12:35 PM IST

ఉపాధ్యాయురాలి అసభ్య పదజాలం... మంత్రికి ఫిర్యాదు

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని కస్తూరిబాగాంధీ బాలిక విద్యాలయంలో మంత్రి శంకర్ నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ''క్రీడాపోటీలకు వెళ్లేటప్పుడు కప్పులతో రండి, కడుపులతో కాదు'' అని... హిందీ ఉపాధ్యాయురాలు అసహ్యంగా మాట్లాడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేస్తూ విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి ఉపాధ్యాయురాలి నుంచి విముక్తి కలిగించాలని కోరారు. వెంటనే అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలికు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:

నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

Intro:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఇ ఫైల్ నేమ్ Ap_tpg_41_07_bvm_lokesh_pressmeet2_Ap10087
మొబైల్9849959923
యాంకర్ :పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు .ఈ సందర్భంగా పాలకొల్లు ఏఏం సి లో విలేకరుల సమావేశం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కమిటీలు కమిషన్లు ప్రభుత్వం గా మారిందని ఎద్దేవా చేశారు .పోలవరం నిర్మాణంలో ఏటువంటి అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పాక వైకాపా ప్రభుత్వం నిర్మాణ పనులు నిలుపుదల చేసింది అన్నారు . ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిలుపుదల చేయడంతో 25 వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు .అమరావతి నిర్మించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు కోత విధిస్తున్నారు. అన్నా క్యాంటీన్ లపై కక్షసాధింపు చర్యగా మూసేస్తున్నారని అన్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారులను రైతులను ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వర్షాలు వరదల సమయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు , జవహర్ ,జడ్పీ చైర్మన్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
బైట్ 1 నారా లోకేష్ , తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
2 నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే

Body:Ap_tpg_41_07_bvm_lokesh_pressmeet2_Ap10087

Conclusion:Ap_tpg_41_07_bvm_lokesh_pressmeet2_Ap10087
Last Updated : Aug 8, 2019, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.