కరోనా సమయంలో పరీక్షలన్నీ రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు యంత్రాంగం మాత్రం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందరినీ ప్రమోట్ చేయాలి..
డిగ్రీ, బీటెక్, పీజీ పరీక్షలన్నింటినీ రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సూర్య చంద్ర హెచ్చరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.