అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాల్యవంతం గ్రామానికి చెందిన వీరిద్దరూ ద్విచక్ర వాహనం లో అనంతపురం నుంచి బత్తలపల్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
ఇదీచదవండి.