అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోలో కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు కుస్తీ పడుతున్నారు. డిపోలో మొత్తం బస్సుల సంఖ్య 48 బస్సులుండగా అందులో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. ప్రయాణికుల కోసం కాలం చెల్లిన బస్సులనే తప్పక ఉపయోగించాల్సి వస్తోంది. మధ్యమధ్యలో బస్సులు ఉన్నఫళంగా ఆగిపోతున్నాయి.
విధి లేక. ప్రయాణికులే బస్సును నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం - ఉరవకొండ, గుంతకల్ ఉరవకొండ మధ్య నడిచే కొన్ని పల్లెవెలుగు బస్సులు ఈ మధ్యకాలంలో రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతోందని ప్రయాణికులు చెప్పారు. కాలం చెల్లిన బస్సులు కాకుండా నూతన బస్సులను డిపోకు కేటాయించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
మొబైల్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్.. 9 బైకులు, రూ. 62 వేలు స్వాధీనం