ETV Bharat / state

కల్వర్టు మరమ్మతు పనులు ప్రారంభం - రోడ్డు పనులు కదిరి

కదిరి క్లాక్ టవర్ సమీపంలో దెబ్బతిన్న కల్వర్టుకు మున్సిపల్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఆరు నెలల క్రితం రంధ్రం పడగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాజాగా మరో రంధ్రం పడి రహదారి దెబ్బ తిన్న కారణంగా మరమ్మతులు చేస్తున్నారు.

culvart repair
కల్వర్టు మరమ్మతు పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
author img

By

Published : Jan 12, 2021, 8:21 AM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం క్లాక్ టవర్ సమీపంలోని హిందూపురం మార్గంలో దెబ్బతిన్న కల్వర్టు మరమ్మతు పనులను అధికారులు చేపట్టారు. కల్వర్టు మధ్యభాగంలో సుమారు ఆరు నెలల కిందట భారీ రంధ్రం పడింది. అప్పుడు మరమ్మతులు చేపట్టకుండా అలసత్వం ప్రదర్శించారు. రహదారి మధ్యలో బారికేడ్లను ఏర్పాటు చేసి వదిలేశారు.

ఇదే కల్వర్టుపై తాజాగా మరో రంధ్రం ఏర్పడింది. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై.. స్థానికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు.. ఆ మార్గంలో భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మరమ్మతు పనులు చేపట్టారు.

ఇదీ చదవండి:

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్​తో హోంగార్డు వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.