ETV Bharat / state

24 గంటల్లో పెళ్లి.. వరుడు అరెస్ట్..! - men cheating girl in the name of love in uravakonda

మరో 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఒకరు చేసిన ఫిర్యాదుతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫలితంగా.. పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.

marriage cancel with the entry of his lover in uravakonda

author img

By

Published : Feb 10, 2022, 5:31 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో మరో 24 గంటల్లో వివాహం చేసుకోవాల్సిన వరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధపడటమే ఇందుకు కారణం. ప్రియురాలి ఇచ్చిన ఫిర్యాదుతో వరుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

ఇదీ జరిగింది..
ఉరవకొండకు చెందిన షర్ఫుద్దీన్​తో.. గుత్తికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. బంధు మిత్రులందరికీ ఆహ్వానాలు అందజేశారు. ఫంక్షన్ హాల్లో పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరో 24 గంటల్లో పెళ్లి.. సరిగ్గా అప్పుడే కథ అడ్డం తిరిగింది. వరుడి ప్రేమాయణం బయటపడింది. ప్రియురాలి ఫిర్యాదుతో.. పెళ్లి ఆగిపోయింది. మరో 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

మరొకరితో ప్రేమాయణం..
షర్ఫుద్దీన్ గతంలో ఉరవకొండకు చెందిన మరో యువతితో ప్రేమాయణం సాగించాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ విషయం ప్రియురాలికి తెలియడం.. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వరుడి గుట్టు బయట పడింది.

ఇదీ చదవండి: CC Video: పెట్రోల్ బంక్​ సిబ్బందిపై ఆకతాయిల దాడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.